కల్లు తాగితే.. కిడ్నీ రాళ్లు, క్యాన్సర్ వ్యాధులు రావు : తెలంగాణ మంత్రి

-

కల్లు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని..కిడ్నీ రాళ్లు, క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో కల్లు గీత వృత్తి కార్మికులకు కేసీఆర్ అభయహస్తం కార్యక్రమంలో మంత్రులు కొప్పుల, గంగుల, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. జనంలో ఉండే కులస్థులు గౌడ కులస్థులు అని.. అంటరానితనం అనేది పట్టించుకోకుండా అందర్నీ కలుపుకుపోయే వారు గౌడ కులస్థులు అని కొనియాడారు.

దేవుని ప్రసాదంగా కూడా కల్లును మనం నమ్మేవారని.. అలంటి వృత్హులను నాశనం చేయాలని చూశారని పేర్కొన్నారు. ఆంధ్రప్రాంతం లో కొబ్బరి చెట్లు కూలితే పరిహారం ఇచ్చేవారు, తెలంగాణ లో తాటిచెట్టు నుండి పడ్డ గౌడ కులస్థులకు పరిహారం ఇవ్వని విధానం ఉండేదని తెలిపారు. తెలంగాణ వచ్చాకే కులాలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. కేసీఆర్ వచ్చాక లభ్ది పొందని కుటుంబం అంటూ లేదని.. ప్రతి కుటుంబం ఎదో ఒక పథకం ద్వారా లభ్ది పొందుతున్నారని గుర్తు చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఇక్కడి పథకాలు లేవని.. తెలంగాణ వచ్చాక భారత దేశంలోనే నెంబర్ 1 స్థాయికి వచ్చిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version