pushpa : పుష్ఫ నుంచి ”శ్రీవళ్లి” సెకండ్ సింగల్ రిలీజ్ డేట్‌ ఫిక్స్‌

-

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం చేస్తున్న మూవీ పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే… ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా కు టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా అల్లు అర్జున్‌ సరసన రష్మిక హీరోయిన్‌ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు విభాగాలుగా విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్.

ఇక ఇప్పటికే ఈ పుష్ప మూవీ నుంచి.. విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్స్ మరియు ఇంట్రడ్యూసింగ్ వీడియోలు మంచి ఆదరణ పొందాయి. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ వదిలింది చిత్రబృందం. ఇప్పటికే శ్రీవళ్లి పేరుతో ఇటీవలే… రష్మిక ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసిన చిత్ర బృందం..

తాజాగా… సెకండ్‌ సింగిల్‌ రిలీజ్‌ డేట్‌ పిక్స్‌ చేసింది. ఈ నెల 13 వ తేదీన శ్రీవళ్లి సెకండ్‌ సింగిల్‌ ను విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం.  కాగా..ఈ సినిమా డిసెంబర్‌ 17 న థియేటర్లలో విడుదల కానుంది పుష్ప.

Read more RELATED
Recommended to you

Exit mobile version