అందానికి వయస్సు తో పని లేదు మిత్రమా..!!

-

సినిమా పరిశ్రమలో సక్సెస్ వెనకే అందరూ పరిగెత్తుతూ వుంటారు అన్నది పచ్చి నిజం. అలాగే కొంత మంది ఏజ్ బార్ అవుతున్నా కూడా , తమ అందాలను చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ తమ కెరియర్ ను లాక్కొస్తూ ఉంటారు. శ్రియ శరణ్ సన్నగా, రివట లాగా కొలతల ప్రకారం హాట్ గా కనిపిస్తూ ఇప్పటికీ మగాళ్ల కు నిద్ర లేకుండా చేస్తుంది. ఆమెకు ఎంత ఏజ్ పెరుగుతున్నా  కూడా యంగ్ వయస్సు లోని అందంతో అలరిస్తూనే ఉంది.

ఇక ఆమె ఫేడ్ అవుట్ అయినా కూడా ఆమెకు డోకా లేకుండా పోయింది. ఎందుకంటే టాలీవుడ్ సీనియర్ హీరోలకు ఆమె మంచి ఆప్షన్ గా వుంది. దానితో టాలీవుడ్ లో సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తెలుగు సీనియర్ హీరోలు ఎప్పుడు పిలిచినా ఆమె పోలో మని ప్లైట్ లో దిగుతుంది. అలాగే డేట్స్ కూడా అడిగినన్ని ఇచ్చి కోపరేట్ చేస్తూ ఉంటుంది.

ఇక ఆమె ఏ మాత్రం గ్యాప్ దొరికినా హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటుంది.ఎప్పటి కప్పుడు తన అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.ఈ బ్యూటీ ఫొటోలు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version