SSMB 29 వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. అమెజాన్ ఫారెస్ట్ అండ్ యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్తో ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా కావడం, అందులోనూ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే జక్కన్న అలాగే మహేష్ బాబు సినిమా నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. మెడలో శివుడి శూలం, నంది అలాగే శివుడి మూడు నామాలు ఉన్న కరంగా మాలను ప్రిన్స్ మహేష్ బాబు ధరించి ఉన్న పోస్టర్ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సంవత్సరం నవంబర్ లో ఈ పోస్టర్ను రివిల్ చేయబోతున్నట్లు కూడా స్పష్టం చేశారు. అప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వబోమని కూడా చెప్పకనే చెప్పారు రాజమౌళి. ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ విడుదల చేయడం జరిగినట్లు వెల్లడించారు.
https://twitter.com/urstrulyMahesh/status/1954056871754789363