ఆ స్టార్ డైరక్టర్లు సైడ్ బిజినెస్ మొదలెట్టారా…!

-

మెగా ఫోన్ పట్టి యాక్షన్ లు,ప్యాకప్ లు చెప్పే దర్శకులు …తమ రైటింగ్ స్కిల్స్ ను సైడ్ బిజినెస్ కోసం వాడుతున్నారు.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదారుగురు దర్శకులు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నారు.టాలీవుడ్ బడా దర్శకులతో పాటు కుర్ర డైరెక్టర్లు… తమ రైటింగ్ స్కిల్స్ ను వదిలిపెట్టడానికి అస్సలు ఆసక్తి చూపడం లేదు.తమ డైరెక్షన్ తో పాటు రైటింగ్ స్కిల్స్ కున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని బయటి హీరోల సినిమాలకు గోస్ట్ రైటర్లుగా వ్యవహరిస్తున్నారు.ఇంకొందరు తమ ప్రొడక్షన్ హౌస్ లలో వేరే దర్శకులతో సినిమాలను నిర్మిస్తున్నారు.

ముందుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన రైటింగ్ స్కిల్స్ ను అమ్ముకుని మంచిగా సైడ్ బిజినెస్ చేసుకుంటున్నాడని చెబుతున్నారు.సితార ఎంటర్ టైన్ మెంట్ లో నిర్మాణమయ్యే చోటా హీరోల ఫిలింస్ కు త్రివిక్రమ్ పెన్ పనిచేస్తుందనే టాక్ ఎప్పటినుంచో వినిపిస్తు ఉంది.సుకుమార్ స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ.. మరో వైపు వెబ్ సిరీస్ కు 9 ప్రేమ కథలు అందిస్తున్నాడు.అక్కడితో ఆగకుండా నిఖిల్ తో 18 పేజెస్ అనే సినిమాను నిర్మించబోతున్నాడు.బేసికల్లీ రైటర్ గా వర్క్ చేయడాన్ని ఎంతో ఆస్వాదించే సుక్కు… రానున్న రోజులలోమరిన్ని కథలను అందించడానికి రెఢీ అవుతున్నాడు.దీన్నొక హాబీగానే కాకుండా సైడ్ బిజినెస్ గాను చూస్తున్నాడు.

టాలీవుడ్లో రచ్చ,బెంగాల్ టైగర్ లాంటి సినిమాలు చేసి సీటీమార్ తో రాబోతోన్న సంపత్ నంది ..ఇప్పటికే తన ప్రొడక్షన్లో వేరే దర్శకులతో గాలిపటం,పేపర్ బాయ్ లాంటి సినిమాలకు స్టోరీలు అందించాడు.అలాగే అ,కల్కి ఫిలింస్ తో డైరెక్టర్ గా నోటెడైన ప్రశాంత్ వర్మ తన స్క్రిప్ట్ విల్లాలో పలు కథలు తయారుచేసి బడా దర్శకులకు అమ్ముతూ ఉంటాడు. ఇలా ఎవరికి వారు ఓ వైపు డైరెక్షన్ చేస్తూనే తమకు అచ్చొచ్చిన రైటింగ్ స్కిల్స్ ను సైడ్ బిజినెస్ గా రన్ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version