సహాయం కోసం ఎదురుచూస్తున్న స్టార్ హీరో కొడుకులు..!

-

మొదటి జనరేషన్లో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించిన నటీనటులు ఒక్కొక్కరిగా మృతి చెందుతున్న విషయం తెలిసిందే. అయితే అందులో కొంతమంది నటుల వారసులు ఉన్నత స్థానానికి చేరుకుంటే.. మరి కొంతమంది నటుల వారసులు ఇతరుల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అలా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎన్నో ఏళ్లపాటు సేవలను అందించి దిగ్గజ నటుడిగా పేరు తెచ్చుకున్నారు కాంతారావు. ఇటీవల ఆయన కుమారుడు రాజా తెలంగాణ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయడంతో ప్రస్తుతం ఆయన మళ్ళి వార్తల్లోకి ఎక్కారు.

ప్రస్తుతం తమ కుటుంబం చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉందని అద్దె ఇంట్లో జీవిస్తున్నామని కాంతారావు కొడుకు రాజా విజ్ఞప్తి చేసుకున్నారు. హైదరాబాదులో రవీంద్రభారతిలో జరిగిన కాంతారావు శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. “నా తండ్రి శత జయంతి వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సినీ పరిశ్రమ అంటే నాన్నకు ఎంతో ఇష్టం. ఆస్తులు అమ్ముకొని మరీ సినిమాలు తీశారు. దానివల్లే మేము ఇప్పుడు చాలా ఆర్థికంగా దెబ్బ తిన్నాము.

ఆయనకు క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా చికిత్స నిమిత్తం ఎంతో డబ్బు ఖర్చు చేశాము.. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటున్నాను.. నగర శివారులలో ఒక అద్దె ఇంట్లో జీవిస్తున్నాము.. ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి మాకు ఎలాంటి సహాయం అందలేదు.. కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒక్కటే ..మాకు ఇల్లు కేటాయించాలని.. సహాయం చేయాలి అని అడుగుతున్నాను” అంటూ రాజా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే గతంలో నటుడిగా, విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కాంతారావు.. ఇప్పుడు ఆయన కొడుకులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడం చూసి ప్రతి ఒక్కరూ బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం వీరికి సహాయం అందిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version