రాజమౌళి మహేశ్ సినిమా హాలీవుడ్ రేంజులో..!!

-

ఇప్పుడు దేశంలో నంబర్ వన్ దర్శకుడిగా మన రాజమౌళి ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే. బహుబలి సినిమా లతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. రీసెంట్ గా రామ్ చరణ్ మరియు జూ ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా తీసి  రికార్డ్స్ బ్రేక్ చేశారు రాజమౌళి.

ఈ సినిమా రిలీజ్ కోసం రీసెంట్ గా జపాన్ కు వెళ్లి వచ్చారు. అక్కడ కూడా సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు తన తర్వాత సినిమా పై మన దేశం తో పాటు అన్ని దేశాలలో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే రాజమౌళి తన తర్వాత సినిమాను మహేశ్ బాబుతో స్టార్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు కూడా మొదటి సారి రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నాడు.

ఈ సినిమా తో మహేశ్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయే అవకాశం ఉంది.ఇప్పుడు వీరు ఇద్దరూ చేయబోతున్న కథ ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా అని , ఈ సినిమాను జేమ్స్ బాండ్ సినిమా అంత క్వాలిటీగా తీయాలని రాజమౌళి ప్రయత్నం చేస్తున్నారట.దీని కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే విషయంపై రాజమౌళి అంతర్గంగా మాట్లాడుతూ నాకు నా రెమ్యునరేషన్ విషయంలో పెద్ద పట్టింపు లేదు.కాని నా సినిమా క్వాలిటీ మాత్రం వరల్డ్ స్టాండర్డ్ లో వుండాలని కోరుకుంటాను అని చెప్పారట. దాని కోసం హాలీవుడ్ వాళ్ళను రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version