స్టార్ హీరోయిన్ ఇంట్లో చోరీ.. ధనుష్ అరెస్ట్ !

-

కోలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ నిక్కీ గల్రానీ ఇంట్లో దొంగతనం కలకలం రేపింది. హీరోయిన్‌ నిక్కీ గల్రానీ ఇంట్ల ఉన్నటు వంటి విలువైన దుస్తులు, కెమెరా కనిపించడం లేదని.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో పని చేసే ధనుష్‌ పై అనుమానం ఉన్నట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో వెల్లడించింది.

గత కొన్ని రోజుల కిందట ధనుష్‌ అనే యువకుడు తమ ఇంట్లో పనికి కుదిరాడని… ఎప్పుడైతే దుస్తులు, కెమెరా చోరీ అయ్యాయో అప్పటి నుంచి అతను కనిపించడం లేదని పేర్కొంది. వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని.. అందుకే ధనుష్‌ పై తనకు అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిట్లు తెలిపింది హీరోయిన్‌ నిక్కీ గల్రానీ. ఇక హీరోయిన్‌ నిక్కీ గల్రానీ ఫిర్యాదు తో రంగంలోకి దిగిన పోలీసులు… ధనుష్‌ కోసం రెండు రోజులు గాలించి తాజాగా అతడి స్నేహితుడి ఇంట్లో పట్టుకున్నారు. ప్రస్తుతం ధనుష్‌ పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version