సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న స్టార్ హీరోయిన్.!

-

ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు.. అలాంటి హీరోయిన్లలో ఒకరు కృతి శెట్టి కూడా.. పంజాబ్ వైష్ణవ తేజ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ తెరకెక్కిన ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అటు వైష్ణవ్ కు ఇటు కృతికి మంచి ఆఫర్లు లభించాయి. యూత్ లో కూడా ఈమెకు బాగా క్రేజ్ పెరిగిపోయింది. అలా రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ అందుకున్న ఈమె కెరియర్ ప్రస్తుతం రిస్కులో పడిపోయింది.

రీసెంట్ గా ఈమె చేసిన దాదాపు 3 చిత్రాలు కూడా భారీగా డిజాస్టర్ గా నిలిచాయి. ఉప్పెన తర్వాత ఈమె నాచురల్ స్టార్ నానితో చేసిన శ్యామ్ సింగరాయ్.. సూపర్ హిట్గా నిలవగా.. ఆ తర్వాత అక్కినేని నాగార్జున – నాగచైతన్య కాంబినేషన్లో సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు సినిమాలో కూడా హీరోయిన్గా నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అలా మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయనందుకు ఆ తర్వాత దివారియర్ , మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలా వరుసగా చాలా సినిమాలు ఆమెకు డిజాస్టర్ ను అందించాయి.

ప్రస్తుతం కస్టడీ సినిమా మాత్రమే ఈమె చేతిలో ఉంది. ఈ సినిమా ఫలితం అటూ ఇటూ అయితే ఇక పూర్తిగా ఈమె ఇండస్ట్రీకి దూరం కావాల్సి ఉంటుంది. మార్చి 12వ తేదీన తెలుగు మరియు తమిళ భాషలలో ఘనంగా విడుదలవుతున్న ఈ సినిమా మీదే కృతి శెట్టి కెరియర్ ఆధారపడింది. ఒకవేళ ఈ సినిమా ఎటు కాకుండా పోతే ఇక ఈమె శాశ్వతంగా సినిమాలకు గుడ్ బై చెప్పాల్సిందే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అవకాశాలు రాకపోతే సినిమాలకు గుడ్ బై చెప్పేసి అమెరికాకి MS చదవడానికి బయలుదేరబోతోందట కృతి శెట్టి.

Krithi Shetty, Tollywood

Read more RELATED
Recommended to you

Exit mobile version