స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి అలర్ట్.. ఆ సేవలు బంద్..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పింది. మీకు స్టేట్ బ్యాంక్ లో ఖాతా వుందా..? అయితే మీరు కూడా దీని గురించి తెలుసుకోవాలి. స్టేట్ బ్యాంక్ తన యోనో యాప్ వెబ్‌ వెర్షన్ సర్వీసులను స్టాప్ చేయనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే….

SBI

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో యాప్ వెబ్‌ వెర్షన్ సర్వీసులను నిలిపి వేయనుంది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రూల్ డిసెంబర్ 1 నుంచి అమలు లోకి రానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్స్ కి తెలియజేయడం కూడా జరిగింది.

ఎస్‌బీఐ యోనో యాప్ వాడుతున్న వారికి నోటిఫికేషన్ ద్వారా ఈ సేవలు నిలిపివేత విషయాన్ని తెలిపింది. యోనో వెబ్‌ వెర్షన్ సేవలు డిసెంబర్ 1 నుంచి అందుబాటులో వుండవు గమనించండి. లేదు అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది ఇలా ఉంటే ఎస్‌బీఐ యోనో మొబైల్ యాప్ ద్వారానే సేవలు పొందగలరు. అయితే ఇంటర్నెట్ సేవలు మాత్రం అలానే ఉంటాయి. యోనా వెబ్ వెర్షన్ సేవలు లో మాత్రమే ఈ మార్పు వస్తోంది అని స్టేట్ బ్యాంక్ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version