Khiladi​ : ఖిలాడీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్

-

మాస్‌ మహారాజ్‌ రవితేజ… యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఖిలాడీ. రమేష్‌ వర్మ దర్శ కత్వంలో రూపొందింతున్న ఈ సినిమా ను ఏ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్పీ పతాకం పై సత్య నారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కు సౌండ్‌ ట్రాక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ స్వర పరస్తున్నారు. ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ముకుందన్‌, మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే.. దీపావళి పండుగ సందర్భంగా ఖిలాడీ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. ఖిలాడీ మేకర్స్‌ తాజాగా ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ ను వదిలారు. డీఎస్పీ తన ట్రేడ్‌ మార్క్‌ పెప్పీ స్టైల్‌ లో కంపోజ్‌ చేసిన ఖిలాడీ టైటిల్‌ సాంగ్‌లో రవితేజ పాత్ర స్వభావాన్ని వివరిస్తుంది. విలాసవంతమైన సెట్‌ లు, విదేశీ లొకేషన్స్‌ లో చిత్రీ కరించిన ఈ సాంగ్‌ లో విజువల్స్‌ మాత్రమే కాకుండా రవితేజ ఎనర్జిటిక్‌ మూవ్స్‌, యశ్వంత్‌ కొరియోగ్రఫీ ఈ పాటకు హైలేట్‌ గా నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version