రేపటి నుంచి స్టేట్ బ్యాంకు లాకర్ ఛార్జీలు ఇవే…!

-

భారత అతి పెద్ద ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తాజాగా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. లాకర్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ బ్యాంకుల్లోని స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్ల ఛార్జీలను పెంచుతూ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. అన్ని కేటగిరీల్లో రూ.500 నుంచి రూ.3000 వరకు లాకర్ ఛార్జీలను స్టేట్ బ్యాంకు పెంచింది.

మెట్రో, అర్బన్‌లో కనీసం రూ.2,000, సెమీ అర్బన్, రూరల్‌లో కనీసం రూ.1,500 ఇక నుంచి లాకర్ కావాలి అనుకున్న వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. లాకర్ పెద్దది కావాలి అనుకుంటే మాత్రం… రూ.12,000 వరకు చెల్లించాలి. వన్‌ టైమ్ లాకర్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.500+జీఎస్‌టీ వసూలు చేస్తామని… లాకర్ రెంట్ ఛార్జీలు గడువు లోగా చెల్లించకపోతే అదనంగా 40% పెనాల్టీ చెల్లించాలని బ్యాంకు స్పష్టం చేసింది.

కొత్త ఛార్జీలు 2020 మార్చి 31 నుంచి అమలులోకి రానున్నాయని బ్యాంకు పేర్కొంది. ఉదాహరణకు మెట్రో, అర్బన్‌లో స్మాల్ లాకర్‌కు గతంలో రూ.1,500 చెల్లిస్తే ఇప్పటి నుంచి రూ.2,000 చెల్లించాలి. మీడియం లాకర్ ఛార్జీలు రూ.3,000 వేల వరకు ఉండగా… రూ.4,000 చేస్తూ నిర్ణయం తీసుకుంది. పెద్ద లాకర్ కు ఇప్పటి వరకు రూ.6,000 ఉండగా ఉంటే మార్చి 31 నుంచి రూ.8,000 చెల్లించాలి. ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్ ప్రస్తుతం ఉండగా… రూ.9,000 వరకు చెల్లించగా… ఇప్పటి నుంచి… రూ.12,000 చెల్లించాలి.

సెమీ అర్బన్, రూరల్‌లో చిన్న లాకర్‌కు ఇప్పటి వరకు రూ.1,000 చెల్లించారు. ఇక నుంచి రూ.1,500 చెల్లించాలి. మీడియం లాకర్ ఛార్జీలు రూ.2,000 వరకు ఉండగా ఇక నుంచి రూ.3,000 చేసింది బ్యాంకు. లార్జ్ లాకర్ ఛార్జీలు రూ.5,000 నుంచి రూ.6,000 వరకు పెరగడం గమనార్హం. ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్‌కు అదనంగా రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. రూ.7,000 ఛార్జీలు ఉంటే మార్చి 31 నుంచి రూ.9,000 చెల్లించాలి. వీటిపై జీఎస్తీ అదనం.

Read more RELATED
Recommended to you

Latest news