వరంగల్ ల్యాండ్ పూలింగ్ పై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం

-

వరంగల్ ల్యాండ్ పూలింగ్ పై వెనక్కి తగ్గింది రాష్ట్ర ప్రభుత్వం. రైతులు ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ (కుడా) ల్యాండ్ పూలింగ్ కు వ్యతిరేకంగా పది రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

రైతుల ఆందోళన పై కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ (కుడా) కార్యాలయంలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి ఆరూరి రమేష్ తో పాటు.. వరంగల్ హనుమకొండ జిల్లా కలెక్టర్లతో కూడా చైర్మన్ సుందర్ రాజు సమీక్షించారు. రైతుల ఇబ్బంది పై సమావేశంలో చర్చలు జరిపారు. ల్యాండ్ పూలింగ్ రైతుల్లో తప్పుడు సంకేతాలు వెళ్తుండటంతో ల్యాండ్ పూలింగ్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్(కుడా) చైర్మన్ సుందర్ రాజ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version