మొదట అట్టర్ ప్లాఫ్‌..తర్వాత బంపర్‌ హిట్‌ అయిన చిరంజీవి మూవీ ఎదో తెలుసా !

-

పాలిటిక్స్ త‌రువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి జోష్‌ మీదున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో చిరుతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు, టీజర్ సినిమా అంచనాలను పెంచాయి.

అలాగే, గాడ్‌ ఫాదర్‌, భోళా శంకర్‌ లాంటి సినిమాలు చేస్తున్నాడు చిరంజీవి. అయితే… చిరంజీవి తన కెరీర్‌ లో ఓ అరుదైన అనుభూతిని ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకు చిరంజీవి కెరీర్లో ఎన్నో విజయాలను అందుకున్నారు. అందులో ఒకటి మహేశ్వరి పరమేశ్వరి బ్యానర్ పై సుబ్బరామిరెడ్డి నిర్మించిన స్టేట్ రౌడీ అనే సినిమా. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన భానుప్రియ, రాధా హీరోయిన్లుగా నటించారు.

1989 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా మొదట్లో ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా మాత్రం రికార్డులు సృష్టించింది. అప్పట్లో ఈ చిత్రం నైజాం లో కోటి రూపాయల కలెక్షన్లను రాబట్టడం జరిగింది. ఈ సినిమా… బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ నటించిన సినిమాలకు మించి కలెక్షన్లు రాబట్టగలిగింది. 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకొని.. నిర్మాతలకు బోలెడు డబ్బులు తెచ్చి పెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version