చంచల్ గుడా జైల్లో రెండు గంటలుగా కొనసాగుతున్న నందకుమార్ స్టేట్మెంట్ రికార్డ్

-

చంచల్‌గూడ జైళ్లో రెండు గంటలుగా నంద కుమార్ స్టేట్ మెంట్ రికార్డు కొనసాగుతుంది. లంచ్ ముందువరకు కేవలం నందకుమార్ వ్యక్తి గత వివరాలను రికార్డు చేసిన ఈడి అధికారులు.. ప్రస్తుతం నంద కుమార్ వ్యాపారాలు, పరిచయాల పై ఆరా తీస్తున్నారు. నంద కుమార్ పార్టనర్స్ గా ఉన్న రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యుల సంబంధాలపై వివరాలను రికార్డ్ చేస్తున్నారు ఈడి అధికారులు. అభిషేక్ తో పరిచయమైన వ్యక్తుల వివరాలు, ఆర్థిక వ్యవరలపైన సమాచారం తీసుకుంటున్నారు ఈడి అధికారులు.

జైలర్ రూమ్‌లో నందు స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నారు ఈడి అధికారులు. నందు స్టేట్మెంట్ రికార్డు గంటపాటు కొనసాగింది. రెండు గంటలకు లంచ్ బ్రేకు తీసుకున్న అధికారులు.. నలభై నిమిషాల తరువాత తిరిగి స్టేట్‌మెంట్ రికార్డుని ప్రారంభించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందు స్టేట్‌మెంట్ కీలకం కానుంది. నందు వ్యాపారలావాదేవీల పై ఆరా తీస్తున్నారు ఈడి అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version