అడవి శేషు అక్కినేని అమ్మాయితో రిలేషన్ నిజమేనా.. ఫొటోస్ వైరల్..!!

-

నిన్నటి రోజున టాలీవుడ్ లోని సినీ ప్రముఖుల సైతం సామాన్య ప్రజల సైతం క్రిస్మస్ వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు. ఇక పలువురు సినీ సెలబ్రిటీలు సైతం అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా అక్కినేని కుటుంబం నుంచి క్రిస్మస్ వేడుకలు ఫోటోలు బయటకు రావడంతో ఇండస్ట్రీలో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. అసలు విషయంలోకి వెళ్తే హీరో అడవి శేషు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు. అడవి శేషు కూడా క్రిస్మస్ వేడుకలకు అక్కినేని కుటుంబంతో కలిసి జరుపుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

అక్కినేని కుటుంబంలో ప్రొడ్యూసర్ గా పేరు పొందిన సుప్రియ గతంలో అడవి శేషు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎవరు స్పందించలేదు. అయితే ఇప్పుడు తాజాగా అడవి శేషు క్రిస్మస్ వేడుకలకు అక్కినేని కుటుంబం లో పాల్గొనడంతో ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.అక్కినేని ఫ్యామిలీలో అఖిల్, సుమంత్ ,సుశాంత్ ,సుప్రియ మరికొంతమంది కుటుంబ సభ్యులతో అడవి శేషు కూడా కలిసిపోయారు. ముఖ్యంగా అడవి శేషు సుప్రియ పక్కన నిల్చోని ఉండడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

ఈ ఫోటోలని అక్కినేని అఖిల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. అక్కినేని కజిన్స్ అని కామెంట్స్ చేయడం జరిగింది అడవి శేషు.. దీంతో అక్కినేని కజిన్స్ ఎలా అవుతారంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.ఆ ఫ్యామిలీతో ఏదో ఒక రిలేషన్ షిప్ లో ఉంటేనే కదా కజిన్ అవుతారు అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్. దీంతో సుప్రియ, అడవి శేషు రిలేషన్షిప్ గురించి సరికొత్త చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version