తమిళనాడులో పురాతన విగ్రహం లభ్యం

-

అప్పుడప్పుడు తవ్వకాల్లో పురాతన కాలం నాటి వస్తువులు, విగ్రహాలు, శిల్పాలు బయటపడుతూ ఉంటాయి. ఎన్నో సంవత్సరం క్రితం అప్పటి మానవులు వాడిన పరికరాలతో పాటు దేవుళ్ల విగ్రహాలు తవ్వకాల్లో కనబడుతూ ఉంటాయి. రాజులకాలం నాటి రాళ్లు, పాత్రలు, శాసనాలు లాంటివి కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి. పురావస్తు శాస్త్రవేత్తలు కొన్నిచోట్ల తవ్వకాలు కూడా జరుపుతారు. ఈ తవ్వకాల్లో పాత కాలం నాటి వస్తువులను వెలికి తీస్తూ ఉంటారు. తాజాగా తమిళనాడులోని శివగంగ జిల్లాలో ప్రాచీన విగ్రహం లభ్యమైంది.

ఓ వ్యక్తి తన తలను తానే నరుక్కుంటున్నట్టుగా ఉన్న ఈ విగ్రహాన్ని చోళపురం వద్ద గుర్తించారు. ఇది 1000 ఏళ్ల నాటిదని భావిస్తున్నారు. కాళికా మాతకు ఆత్మార్పణం చేసుకోవడాన్ని తమిళ సంస్కృతిలో ‘అరికందమ్’ అంటారు. నాడు యుద్ధంలో గెలిచినా, ఏదైనా జబ్బున బారినపడి కోలుకున్నా అమ్మవారికి ఆత్మబలిదానంతో మొక్కు తీర్చుకోవడం అనేది ‘అరికందమ్’ గా భావిస్తారు. ప్రాణత్యాగం చేసిన వ్యక్తి తన శరీరాన్ని 9 ముక్కలుగా నరకమంటే దాన్ని ‘నవకందమ్’ అని పిలుస్తారు.

ఇప్పుడు లభ్యమైన పురాతన విగ్రహం కూడా ఓ వ్యక్తి ‘అరికందమ్’కు పాల్పడుతున్నట్టుగా చెక్కారు. వెయ్యేళ్ల నాటి ఈ విగ్రహాన్ని చోళపురం, నాలుకొట్టై గ్రామం మధ్యన ఉన్న అమ్మన్ ఆలయంలో గురించారు. ఇది రెండు అడుగుల ఎత్తు, ఒకటిన్నర అడుగుల వెడల్పుతో ఉంది. ఆ వ్యక్తి ఎడమ చేయి జుట్టును పట్టుకుని ఉండగా, కుడి చేతిలో కత్తితో తల నరుక్కుంటున్నట్టుగా ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version