మాస్కులు పని చేయవు అన్నందుకు.. ట్రంప్ సలహాదారుపై చర్యలు..?

-

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి క్రమంలో మాస్కులు వాడటం అనివార్యంగా మారిపోయింది. అయితే ప్రభుత్వాలు తప్పనిసరిగా కరోనా వైరస్ నియంత్రిం చడంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అని సూచిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ ఒక ప్రముఖ వ్యక్తి మాత్రం మాస్కులు పనిచేయవు అంటూ వ్యాఖ్యానించడం సంచలనం గా మారిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్కులు పనిచేయవంటూ వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలోనే మాస్కులు పనిచేయవు అంటూ వ్యాఖ్యానించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చర్యలు తీసుకుంది ట్విట్టర్. ఆయన చేసిన పోస్టులను వెంటనే తొలగించింది. ఇటీవల డోనాల్డ్ ట్రంప్ సలహాదారు చేసిన పోస్టు తమ సంస్థ విధానానికి విరుద్ధం అంటూ మొదట స్పష్టం చేసిన ట్విట్టర్ ఆ తర్వాత పూర్తిగా ట్వీట్ను తొలగించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version