నేటితో ఐదో రోజు వరుసగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పడ్డాయి. ఇన్వెస్టర్లు కొనుగోలుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో చివరికి సెన్సెక్స్ 187 పాయింట్లు లాభపడి 36,675 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 36 పాయింట్లు లాభపడి 10,800 వద్ద ముగిసింది. ఉదయం పూట కాస్త ఆచితూచి మొదలైన స్టాక్ మార్కెట్లు యూరోపియన్, యూఎస్ మార్కెట్లు 2% లాభాల బాట పట్టగా మధ్యాహ్నం నుండి భారత మార్కెట్లో కూడా వేగాన్ని పెంచాయి.
ఇక నేడు ఇంట్రాడే స్టేషన్లో నిఫ్టీ 50 లో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ల్యాండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. ఇందులో బజాజ్ ఫైనాన్స్ ఏకంగా 7 శాతం మేర లాభపడింది. అలాగే మరోవైపు అదానీ పోర్ట్స్, ఎన్టిపిసి, ఐటిసి, పవర్ గ్రిడ్ కార్ప్, గ్రాసిమ్ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఇందులో ముఖ్యంగా ఆధాని స్పోర్ట్స్ 3 శాతం పైగా నష్టపోయింది.