ఆ నదిలో బంగారం దొరుకుతుందట..ఎక్కడో కాదు ఇండియాలోనే ఉందది..!

-

బంగారం..ఏడాదిపొడవుగా అదిరిపోయే ధర పలుకుతుంది. బంగారాన్ని ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. బంగారంలో పెట్టుబడి అంటే..నష్టాలు లేని వ్యాపారం లాంటిదే..ఒకసారి ఊహించుకోండి. ఒక నదిలో బంగారం ఉంటే. అది మీరు తీసుకోగలిగితే..అబ్బో జీవితం ఇక యూటర్న్ తీసుకున్నట్లేగా..ఇది మీ ఊహలకతే పరిమితం అనుకోకండి..నిజంగానే ఆ నదిలో బంగారం దొరుకుతుంది అంట.. అందుకే ఆ నది పేరులోనో బంగారం ఉంది. అక్కడి ప్రజలు ఎంచక్కా ఆ బంగారాన్ని సంపాదించుకుంటున్నారు. ఇంతకీ ఆ నది ఎక్కడ ఉందో ఏంటో మనమూ చూద్దాం.

జార్ఖండ్, బెంగాల్, ఒడిశాలో ఈ నది ప్రవహిస్తోంది. దాని పేరు సువర్ణరేఖ నది. దీన్నే సుబర్ణరేఖ, స్వర్ణ రేఖ నది అని కూడా పిలుస్తుంటారు. ఇందులో బంగారం లభిస్తుంది కాబట్టే ఈ నదికి ఈ పేరు వచ్చింది. హైలెట్ ఏంటంటే అసలు ఈ నదిలోకి బంగారం ఎలా వస్తోంది… ఎక్కడి నుంచి వస్తోంది అనేది ఎవరికీ తెలియదట. శాస్త్రవేత్తలు కూడా కొంత ప్రయత్నించి ఎంతకి అంతుపట్టక వదిలేశారు. ముఖ్యంగా జార్ఖండ్ రాజధాని రాంచీకి దగ్గర్లో పిస్కా అనే గ్రామం ఉంది. అక్కడే ఈ నది పుడుతోంది. అక్కడ ప్రజలు నది ఒడ్డుకు వెళ్లి ఇసుకను జల్లెడ పడితే… అందులో బంగారం లభిస్తోందట… అందువల్ల రోజూ ప్రజలు నది దగ్గరకు వెళ్లి ఇసుకను సేకరించి దాన్ని నీటితో మెల్లమెల్లగా తడుపుతూ పెద్ద రాళ్లన్నీ పోయేలా చేస్తారు. ఇలా ఫిల్టర్ చేసి చేసి… చివరకు సన్నటి రజను మిగులుతుంది. దాన్ని కూడా ప్రాసెస్ చెయ్యగా… బంగారం మిగులుతుంది. ఆ బంగారాన్ని వారు అమ్ముకొంటున్నారు.

ఎక్కువేం కాదు..అయినా తక్కువే రాదు

ఇక్కడ బంగారం అనేది కుప్పలు తెప్పలుగా ఏమీ దొరకదు. చాలా తక్కువగానే దొరుకుంది. అయినప్పటికీ… బంగారం ఒక గ్రామే..4వేల పైన ఉంటుంది..రోజకు అరగ్రామ్ దిరికినా చాలదా ఏంటి..అందుకే ఎంత దొరికినా చాలనుకుంటున్నారు స్థానికులు. దాన్ని సంపాదిస్తూ బతికే వారు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా మంది తెల్లారుతూనే నదికి వస్తారు. తమ దగ్గరున్న ప్రత్యేక వస్తువులతో నీటితో తడుస్తూ ఉన్న ఇసుకను సేకరిస్తారు. దాన్ని జల్లెడపడతారు. మధ్యాహ్నం దాకా ఈ పనిచేస్తారు. ఆ తర్వాత తమతో తెచ్చుకున్న గిన్నెలో బంగారం రజనును వేసుకొని పట్టుకెళ్తారు. ఆ బంగారాన్ని కొంత మంది తమ ఇళ్ల దగ్గర అమ్ముకుంటారు. మరికొందరు రాంచీకి వెళ్లి… అక్కడి బంగారం షాపుల్లో అమ్ముకుంటున్నారు.

ఈ సీజన్లో బాగా వస్తుందట

ఈ నదిలో శీతాకాలంలో ఎక్కువగా గోల్డ్ లభిస్తోంది. అది ఎక్కడి నుంచి వస్తోందో తెలియట్లేదు. ఈ నది దాదాపు 395 కిలోమీటర్లు ప్రవహిస్తుందట. తల్సారీ దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మూడు రాష్ట్రాలను టచ్ చేస్తున్నా… జార్ఖండ్‌లో లభించినంతగా బంగారం మిగతా రాష్ట్రాల్లోని నది ఒడ్డున లభించకపోవటం విశేషం. జార్ఖండ్‌లో కూడా నది ప్రారంభమైన ప్రదేశం దగ్గరే ఎక్కువగా దొరుకుతుంది. అక్కడి భూగర్భంలో బంగారు గనులు ఉండి ఉండొచ్చనే అనుమానం ఉంది. కానీ… ఆ దిశగా ఎలాంటి తవ్వకాలూ అయితే ఇప్పటివరకూ జరగలేదు. నిజానికి జార్ఖండ్‌లో బొగ్గు గనులు, బంగారం గనులు ఎక్కువే.

బంగారం దొరికినా..వారి స్థితి ఏం మారలా

నదిలో బంగారంపై ఆధారపడి నది చుట్టుపక్కల చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి. కొన్ని తరాలుగా ఇలా బంగారం సేకరిస్తూనే ఉన్నారట. అయితే ఇంకే వాళ్లు బాగా ధనంవంతులు అయిపోయి ఉండొచ్చు అనుకుంటున్నారా..పాపం అలా ఏం జరగలేదు.. ఎందుకంటే గంటల తరబడి ప్రయత్నిస్తే ఒక వ్యక్తికి ఒక రోజుకి 1 గ్రాము లభించడం కూడా కష్టమే. ఒక్కోసారి ఏమీ దొరదు. పడిన కష్టమంతా వృథా అవుతుంది. మార్కెట్లో 1 గ్రాము బంగారం ధర రూ.5వేల దాకా ఉంది. కానీ… స్థానికులు ఆ బంగారాన్ని చాలా తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. అందువల్ల వారి జీవితాల్లో మార్పులేవీ లేవు. కొందరైతే నెలకు రూ.5వేల నుంచి రూ.7వేల దాకా మాత్రమే సంపాదిస్తున్నాట.

బంగారం దొరికిన భవిష్యత్ మాత్రం మారలేదు. మొత్తానికి అలా ఆ నదిలో అయితే బంగారం దొరుకుతుందనమాట.!

Read more RELATED
Recommended to you

Exit mobile version