ఒకే దేశం అయినా సరే పాటించే పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కరి సంస్కృతి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ జరిగే వింత ఆచారం చూస్తే నిజంగా షాక్ అవుతారు. విదేశాలలో ఎక్కువగా పెళ్లికి ముందు సహజీవనం చేస్తారు. సహజీవనం పేరుతో విచ్చలవిడిగా ఉంటూ పిల్లలను కని నచ్చితే పెళ్లి చేసుకుంటూ వుంటారు అదే నచ్చకపోతే వదిలేస్తారు.
ఎక్కువగా ఇలాంటి పద్ధతులు విదేశాల్లో ఉంటాయి. కానీ మన దేశంలో ఉండవు అనుకుంటే పొరపాటే. భారతదేశంలో ఒక తెగ ఇప్పటికీ ఈ వింత ఆచారం ని ఫాలో అవుతున్నారు. అయితే మరి ఆ ఆచారం గురించి, అక్కడ పాటించే పద్ధతి గురించి ఇప్పుడు చూద్దాం. విదేశాల్లో లాగానే ఇక్కడ కూడా ఒక తెగ వింత ఆచారం ని ఫాలో అవుతున్నారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉండే కొన్ని తెగల్లో సహజీవన సంప్రదాయం కొనసాగుతోంది.
ఇది కొన్ని దశాబ్దాలుగా అక్కడ జరుగుతున్నది. యుక్తవయసుకు వచ్చిన తర్వాత అమ్మాయిలు తమకు నచ్చిన అబ్బాయిని పెంచుకోవడానికి వీలుగా రెండు రోజుల జాతర నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ మగవాడితో పెళ్లి తో సంబంధం లేకుండా కాపురం చేస్తారు. ఈ క్రమంలోనే అబ్బాయి కుటుంబం కన్యాశుల్కంగా అమ్మాయి కుటుంబానికి కొంత మొత్తం చెల్లించాలి. అప్పుడు సహజీవనం మొదలవుతుంది. భవిష్యత్తులో వీళ్ళు పిల్లల్ని కని పెళ్లికి సిద్ధం అయితే పెళ్లి ఖర్చు అంతా అబ్బాయి వాళ్ళు భరించాలి. గరీసియా తెగ లో ఈ ఆచారం శతాబ్దాలుగా ఉంది వాటిని ఇప్పటికీ కూడా అనుసరిస్తున్నారు.