యుద్ధాన్ని ఆప‌లేం..ఉక్రెయిన్ కు చెప్ప‌లేం..ర‌ష్యాను నిలువ‌రించ‌లేం

-

యుద్ధాన్ని ఆప‌డం అన్న‌ది ఇప్పుడు సాధ్యం కాని మాట అని అనిపిస్తోంది. నిర్థారితం అవుతోంది. ఉన్నంత‌లో యుద్ధానికి విరుగుడు ఏదీ లేదు అని  కూడా తేలిపోయింది. అందుకే అంతా యుద్ధానికి ప్ర‌త్యామ్నాయం శాంతి మార్గం అని చెప్పినా కూడా వినేంత స్థితిలో ఎవ్వ‌రూ లేరు. ఆ విధంగా ఇవాళ ర‌ష్యా మ‌రియు ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య ప‌రిణామాలు అనూహ్య గ‌తిలో మారిపోతున్నాయి. అయినా కూడా మిగ‌తా దేశాల జోక్యం పెద్ద‌గా లేదు. ఉన్నా కూడా ఇప్పటికిప్పుడు సాధించేదేమీ లేదు అని కూడా తేలిపోయింది. భార‌త్ లాంటి దేశాలు త‌ట‌స్థ వైఖ‌రినే కొన‌సాగిస్తూ వ‌స్తున్నాయి.

యుద్ధం ప్ర‌భావం త‌మ‌పై ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హిస్తున్నాయి. అదేవిధంంగా త‌మ దేశానికి చెందిన బిడ్డ‌ల‌ను స్వ‌దేశానికి చేర్చే ప్ర‌య‌త్నాల‌ను మాత్రం ఇప్ప‌టికే స‌ఫ‌లీకృతం చేశాయి. ఇవి మిన‌హా భార‌త్ కానీ సంబంధిత ప‌రిస‌ర దేశాలు కానీ పెద్ద‌గా సాధించింది ఏమీ లేదు. ఇక‌పై ఉండ‌దు కూడా ! భార‌త్ లాంటి దేశాల త‌ట‌స్థ వైఖ‌రి మంచిదే కానీ శాంతిని ఆశించే దేశాలు ఇటువంటి క‌ల్లోలితాల‌ను నివారించేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం ఓ విధంగా విస్మ‌య‌క‌రం.

ఇక చైనా కానీ అమెరికా కానీ స్వ‌లాభ సిద్ధిలో భాగంగానే ఉన్నాయి.  అవి కూడా యుద్ధానికి సంబంధించి నిలువ‌రింత ధోర‌ణుల్లో లేవు. అమెరికా అయితే ఇప్ప‌టికీ ఉక్రెయిన్ ను రెచ్చ‌గొడుతూనే ఉంది. కొన్ని చోట్ల ఉక్రెయిన్, మ‌రికొన్ని సంద‌ర్భాల్లో ర‌ష్యా ద‌ళాలు త‌మ పై చేయి సాధించినా అంతిమంగా శ‌వాల‌ను మాత్రం పోగేసుకోవ‌డం ఆప‌డం లేదు.

ఆ విధంగా ఈ నిర్జీవ కాండ‌ను నిలువ‌రించ‌డం అస్సలు సాధ్యం కావ‌డం లేదు. న‌ర‌మేధం ఆందోళ‌నకర రీతిలో ఉన్నా ఐక్య రాజ్య స‌మితి మాట్లాడుతున్న‌దేమీ లేదు.  ఈ ద‌శ‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న స‌మాచారం అనుస‌రించి రెండు దేశాలు మ‌రికొద్ది  రోజు త‌మ ప‌ట్టుద‌ల‌ను కొన‌సాగించ‌నున్నాయి. ఆ విధంగా మ‌రిన్ని రోజులు  న‌ర‌మేధం అయితే ఆగ‌దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version