వింత: పెళ్ళిలో పాటించే ఈ వింత ఆచారాల్ని చూస్తే షాక్ అవుతారు..!

-

పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. పెళ్లితో రెండు కుటుంబాలు దగ్గరవుతాయి. సాధారణంగా పెళ్లిళ్లు ఎవరి సంప్రదాయం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. పద్ధతి ప్రకారం పెళ్ళిళ్ళని నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో ఘనంగా సంప్రదాయాన్ని పాటిస్తూ పెళ్లిని జరుపుకుంటూ ఉంటారు.

 

అయితే ఈ సంప్రదాయాలు చాలా వింతగా ఉన్నాయి. మరి పెళ్లి లో పాటించే ఆ వింత సంప్రదాయాల గురించి ఇప్పుడు చూద్దాం. నిజంగా ఈ సంప్రదాయాలని కనుక మీరు చూశారంటే షాక్ అవుతారు. అయితే మరి ఆ వింత సంప్రదాయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

బెంగాలీ పెళ్లిళ్లు:

సాధారణంగా బెంగాలీ పెళ్లిళ్లు మనం చూసుకున్నట్లయితే పద్ధతి ప్రకారం వాళ్లు కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే బెంగాలీ పెళ్లిళ్లలో ఒక వింత సంప్రదాయం ఉంది. అది ఏంటంటే బెంగాలీ తల్లులు తమ పిల్లల పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు. వాళ్లు కనుక పెళ్లికి వెళ్లారు అంటే ఇబ్బందులు వస్తాయని దాంపత్య జీవితంలో గొడవలు కలుగుతాయని వాళ్ళ అభిప్రాయం. అందుకనే బెంగాలీ సంప్రదాయం లో తల్లులు పిల్లల పెళ్లిళ్ల కి వెళ్లరు.

మణిపురి పెళ్లిళ్లు:

మణిపురి పెళ్లిళ్లు చూసుకున్నట్లయితే పెళ్లికి ముందు వధూవరులిద్దరూ ఒక జత చేపలు తీసుకుని నీళ్ళల్లో వదిలి పెట్టాలి. ఇది వాళ్ళ యొక్క సాంప్రదాయం. చూశారా ఎంత వింతగా ఉందొ ఈ సాంప్రదాయం.

అస్సాం పెళ్లిళ్లు:

అలానే అస్సాంలో వాళ్ళు పెళ్లి అంటే కేవలం దండలు మార్చుకోవడం అని అంటారు. ఒకసారి వధూవరులు దండలు మార్చుకుంటే ఇంక పెళ్లి అయిపోయినట్లే. అదే వారి సంప్రదాయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version