వైఎస్ షర్మిళ సంచలనం… రైతులను ఆదుకోవడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు అంటూ….

-

సీఎం కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా రైతుల పంట నష్టంపై నిలదీశారు. రాష్ట్రంలో పలు సమస్యలపై ఇటీవల వైఎస్ షర్మిళ రోజూ స్పందిస్తున్నారు. గతంలో నిరుద్యోగ సమస్య, నోటిఫికేషన్లు, రైతుల ఆత్మహత్యలు, వరి కొనుగోళ్లపై ప్రభుత్వాన్ని నిలదీసింది. తాజాగా ఇటీవల అకాల వర్షాలతో జరిగిన పంట నష్టం, పరిహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

వైఎస్ షర్మిళ ట్విట్టర్ లో… కోర్టులు మొట్టికాయలు వేస్తే కానీ సారుకు బాధ్యతలు గుర్తు రావని… నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలనే సోయి రాదని విమర్శించింది. రైతుబంధు ఒక్కటిచ్చి పంటబీమాను ఎత్తేసిన దొర పుణ్యానికి, రెండేండ్లలో లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే కనీసం అణాపైసా సహాయం చేసిందిలేదని.. దొర ఇచ్చేది లేదు, కేంద్రం ఇచ్చింది ఇవ్వడని, ఇక మొన్నటి వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకొంటామని ఉత్త చేతులతో ఊపుకొంటూ పోయివచ్చిన మీరు పరిహారం ఇస్తారంటే నమ్మాలంటారా? రైతుబంధు వారోత్సవాలు చేయడం తెలుసు కానీ రైతులకి పరిహారం ఇవ్వడం తెలియదా దొరగారు? రైతును ఆదుకోవడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు అంటూ వ్యాఖ్యానించింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version