రోజు రోజుకి హిందూ ఆలయాల్లో చోరీలు ఎక్కువై పోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో హిందూ ఆలయం లో వింత చోరీ ఒకటి చోటు చేసుకుంది. ఈ దొంగ హుండీ జోలికి వెళ్ళలేదు, బంగారం కూడా కాజేయలేదు. కానీ ఈ దొంగ తీసికెళ్ళింది ఏమిటో చూస్తే షాక్ అవుతారు. వివరాల లోకి వెళితే… ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా అప్పన్నపల్లి లోని శ్రీ బాల బాలాజీ ఆలయంలో చోటు చేసుకుంది. ఎంతో వింతగా ఈ దొంగ తలనీలాలు దొంగతనం చేశాడు. ఏకంగా ఒక బ్యాగు నిండా తల నీలాలను దోచుకెళ్లాడు.
వీటి విలువ దాదాపు రెండు లక్షల రూపాయలుంటాయని తెలుస్తోంది. ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తి తలనీలాల బ్యాగుతో పరారయ్యాడు. ఈ విషయం ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. చోరీ జరిగిన తీరుచూస్తుంటే ముందు రెక్కీ నిర్వహించిన తర్వాతే దొంగతనానికి పాల్పడ్డట్లు పోలీసులు భావిస్తున్నారు. లేదా బాగా తెలిసిన వారే చేసి ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు.