బ్రేకింగ్: మాజీ సిఎం ఆరోగ్యం విషమం, అర్జెంట్ గా హాస్పిటల్ కు కుటుంబం

-

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆయనను రాంచీలోని రిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ చేసారు. అకస్మాత్తుగా ఆరోగ్యం విషమించడంతో లాలూ యాదవ్‌ ను గురువారం సాయంత్రం ఆసుపత్రికి తరలించారు. బీహార్‌ రాజకీయాలను శాసించిన లాలూ ప్రసాద్ యాదవ్… చాలా కాలంగా అనేక అనారోగ్యాలతో పోరాడుతున్నాడు.

వెంటనే అతని కుమార్తె మీసా భారతి రిమ్స్‌కు చేరుకున్నారు. సమాచారం అందుకున్న విపక్ష నేత చిన్న కుమారుడు, తేజశ్వి యాదవ్, మరియు భార్య రబ్రీ దేవి పాట్నా నుండి చార్టర్డ్ విమానంలో రాంచీకి చేరుకోనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం స్థిరంగా ఉందని కుటుంబం చెప్పింది. అయితే ఆయన ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉంది అని అధికారులు పేర్కొన్నారు. చికిత్స జరుగుతోంది అని అన్నారు.

ఇది ఒక రకమైన న్యుమోనియా అని వివరించారు. ఆయన కుమార్తె మాట్లాడుతూ తాము ఎయిమ్స్ ఊపిరితిత్తుల విభాగం అధికారితో చర్చించామని ఆయన కరోనా పరీక్షా చేయగా నెగటివ్ వచ్చింది అని ఆమె వెల్లడించారు. ఇక ఇటీవల స్పీకర్ ఎన్నిక సమయంలో లాలు ప్రసాద్ యాదవ్ ఒక ఎమ్మెల్యేలకు ఫోన్ లు చేసారు అనే ఆరోపణలు రాగా దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. దాణా కేసులో ఆయన ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version