గ్రూప్-1 పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

-

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ నెల 11వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులను పరీక్ష మొదలు కావడానికి రెండు గంటల ముందు అంటే.. ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఎగ్జామ్ ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందు గేట్లను క్లోజ్ చేయనున్నారు. ఉదయం 10.15 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించమని కమిషన్ స్పష్టం చేసింది. పేపర్ లీకేజీతో పాటు గతంలో జరిగిన పలు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 11న జరగాల్సి ఉన్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తోంది. అనేక కఠిన నిబంధనలను అమలు చేయనుంది.

హాల్​టిక్కెట్ తో పాటు పాస్​పోర్ట్​, ఓటర్​ ఐడీ, ఆధార్​ తదితర ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఒకటైనా తమ వెంట తీసుకురావాలని
సూచించారు. ఓఎంఆర్​ షీట్​లో వైట్ నర్​, చాక్ పౌడర్​, బ్లేడ్​, ఎరేజర్​లాంటివి వాడకూడదని తెలిపారు. అభ్యర్థులు బూట్లు ధరించి
రాకూడదని, చెప్పులతో రావాలని సూచించారు. కేంద్రంలో ఎలాంటి స్లోగన్స్‌ ఇవ్వకూడదని, ఇతరులతో మాట్లాడడం, ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టే ఎలాంటి ప్రయత్నం చేసినా కఠిన చర్యలు ఉంటాయని కమిషన్ తెలిపింది. అభ్యర్థులను రెండు దశల్లో తనిఖీ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని.. భవిష్యత్ లో నిర్వహించే ఎలాంటి పరీక్షలకు అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version