హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి గురువారం ఫిష్ఫుడ్ఫెస్టివల్ ప్రారంభించారు మంత్రి తలసాని శ్రీనివాస్.మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని మంత్రి తలసాని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వీక్షించడానికి జనాలు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ నేపధ్యం లో మంత్రి ప్రసంగిస్తూ.. ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌కి అందరు తరలి రావాలని అన్నారు. 600 మంది మహిళలకు ఫిష్కుకింగ్లో ట్రైనింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 800 స్టాల్స్ ప్రారంభమైనట్లు వెల్లడించారు మంత్రి. ఈ నెల 10 వ తేదీ వరకు ఫెస్టివల్ జరగనున్నట్లు తెలిపారు.
మత్స్యకారుల సంక్షేమానికి గత ప్రభుత్వాలు బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు ఆ బడ్జెట్‌ను రూ.100 కోట్లకు పెంచినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు మంత్రి తలసాని. సీఎం కేసీఆర్ వారి సంక్షేమాన్ని కాంక్షించి ఎన్నో పథకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు ఆయన. వచ్చే రోజుల్లో అన్ని పట్టణాల్లో ఫిష్ స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. డిగ్నిటీ భవన్ కి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు మంత్రి తలసాని.