రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నిర్వాహకులు నరకం చూపిస్తున్నారు. వారికి కల్తీ ఆహారం వడిస్తుండటంతో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం నారాయణపేట జిల్లాలోని మాగనూర్ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగి సుమారు వంద మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు ఆస్పత్రి బెడ్ మీద చికిత్స తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే గురువారం ఉదయం వారికి వడ్డించిన టిఫిన్‌లోనూ పురుగులు వచ్చాయి. నేటి ఉదయం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇచ్చిన ఉప్మాలో పురుగులు రావడం కలకలం రేపింది.అది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందితో గొడవకు దిగారు. ఇదేమిటని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఆందోళనకర వాతావరణం నెలకొంది. విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా? అని సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
BIG BREAKING NEWS
దారుణం మళ్లీ మళ్లీ అదే నిర్లక్ష్యం.. పిల్లల ప్రాణాలు అంటే లెక్క లేదా
విద్యార్దులకు ఆసుపత్రిలో ఇచ్చిన టిఫిన్లో సైతం పురుగులు
నారాయణపేట జిల్లా మాగనూర్ హైస్కూల్ ఫుడ్పాయిజన్ ఘటనలోని విద్యార్థులను మహబూబ్ నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే..… https://t.co/lMiviUU847 pic.twitter.com/v9tys7NOGA
— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024