ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని వంగలపూడి గ్రామంలో గ్రామస్తులు, ఇసుక ర్యాంపు నిర్వాహకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. అధిక ధరకు ఇసుకను అమ్ముతుండటంపై వంగలపూడి గ్రామస్తులు ఒక్కసారిగా తిరగబడ్డారు. ప్రభుత్వం చెప్పిన ధరకు కాకుండా అధిక ధరకు ఎలా విక్రయిస్తారని ఇసుక ర్యాంప్ యాజమానితో గొడవకు దిగారు.
దీంతో ఇరు పక్షాల మధ్య కాసేపు వాగ్వాదం నెలకొంది. ర్యాంపులో ఇసుక అధిక ధరకు విక్రయిస్తున్నారని, ప్రభుత్వం చెప్పిన ధరకే ఇసుక ఇవ్వాలంటూ స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ప్రభుత్వం దిగివచ్చేవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని పట్టుబట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఇసుక ర్యాంప్ నిర్వాహకుడిపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.