రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఏం తినాలి, ఎలా ఉండాలి ఇలా చెప్తుంటారు. ప్రేమ వల్ల కూడా ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది తెలుసా..? ప్రేమకు ఉన్న శక్తి అలాంటిది. మనల్ని సంతోషంగా ఉంచాలన్నా, బాధలో కుంగిపోయేలా చేయలన్నా అది ప్రేమతో సాధ్యం అవుతుంది. మనిషి మానసికంగా ఎంత ఆరోగ్యంగా ఉంటాడో.. శారీరంగా అంతకు రెండింతలు ఆరోగ్యంగా ఉంటారట. ఓహియో స్టేట్ యూనివర్శిటీలో నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని రుజువు చేసింది.
చెడు ఆహారాన్ని తినిపించి, బేషరతు ప్రేమతో పెరిగిన ఎలుకలు దాని ప్రభావాలను ప్రతిఘటించాయి. అయితే, ప్రేమను పొందని ఎలుకలు చెడు ఆహారంతో ప్రభావితమయ్యాయి. అంతే కాదు ప్రేమ ఉంటే దేన్నైనా తట్టుకోగల శక్తి ఉంటుందని మరోసారి ఈ అధ్యయనం నిరూపించింది. దానికి తోడు మనం తినే ఆహారం కంటే మన మానసిక స్థితి ముఖ్యమని తేలింది.
ఒత్తిడే అనారోగ్యానికి మూలకారణం
సాధారణంగా స్వీట్ స్నాక్స్ తిన్న తర్వాత మధుమేహం వస్తుందని ప్రతి ఒక్కరిలో బలమైన భావన ఉంటుంది. కానీ తీపి పదార్థాలను తినడం కంటే ఒత్తిడి, ఆందోళన, నిష్క్రియాత్మక జీవనశైలి వల్ల మధుమేహం వస్తుంది. ఆహారం చురుకుగా ఉంటే, శరీరం దానిని జీర్ణం చేస్తుంది. ఎక్కువ కాలం పోషకాలు లేని జంక్ ఫుడ్ తింటే శరీరానికి ఇబ్బందులు తప్పవు. కానీ ఒక్కసారి స్వీట్లు తిన్నా ఏమీ జరగదు. అయితే మనిషికి ఒత్తిడి, ఆందోళన అనారోగ్యానికి మూల కారణం అవుతాయి. అదనంగా, ఓహియో స్టేట్ యూనివర్శిటీకి చెందిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రియమైన వ్యక్తి నుండి ప్రేమ ఉన్నప్పుడు, మనస్సు సంతోషంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాధుల నుండి రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది.
స్పర్శ యొక్క ప్రాముఖ్యత
ప్రియమైన వ్యక్తి యొక్క స్పర్శ ఆందోళన, ఒంటరితనం నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది. అందువల్ల, జంటలకు పరస్పర స్పర్శ చాలా ముఖ్యం. అంతే కాదు డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జయిటీ నుంచి ఉపశమనం పొందేందుకు స్పర్శ అద్భుతమైన మార్గం. అందుకే మీకు బాధగా ఉన్నప్పుడు ఇష్టమైన వారిని కౌగిలించుకుంటే చాలా హాయిగా మనసుకు తేలిగ్గా అనిపిస్తుంది. కొలంబియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో, సామాజిక సాంగత్యం మరియు ప్రియమైనవారి స్పర్శ డోపమైన్ హార్మోన్ విడుదలను పెంచుతుందని తేలింది.
గుండె పగిలిపోవడం నిజమేనా?
సాధారణంగా మనం ఏదైనా విషయం గురించి చాలా బాధగా ఉన్నప్పుడు, మన గుండె పగిలిందని చెబుతాము. ఇది ఏదో మన బాధను వ్యక్తపరచడానికి చెప్పింది కాదు, ఇది నిజమేనట. ఒక అధ్యయనం ప్రకారం, బాధపడితే.. గుండె ఎక్కువగా దెబ్బతింటుంది. అప్పుడు ప్రేమతో సంబంధం ఉన్న ఆక్సిటోసిన్ అనే హార్మోన్ మందులా పనిచేస్తుంది. గుండెకు డ్యామేజ్‌ని రిపేర్ చేస్తుంది.