అభిజీత్‌కు ఊహించని షాక్ ఇచ్చిన సుదీప్..!

-

బుల్లితెరపై బిగ్ బాస్ షోకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ షో వారం మొత్తం ఎలా గడిచిన సండే వచ్చిందంటే చాలు ఫుల్ ఫన్ గా మారిపోతుంది. ఈ షోకి స్పెషల్ గెస్టులను కూడా ఆహ్వానిస్తారు. ఇప్పటివరకు ఈ షోకి సమంత అక్కినేని, అఖిల్, పాయల్, కార్తికేయ, సుమ కనకాల సహా కమల్ హాసన్ కూడా గెస్టుగా వచ్చాడు. ఇక అందులో భాగంగానే ఈ వారం కన్నడ సూపర్ స్టార్ సుదీప్ షోకు వచ్చాడు. బిగ్ బాస్ షోతో సుదీప్‌కు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే కన్నడలో ఇప్పటికే 7 సీజన్స్ ఆయన హోస్టుగా చేసాడు.

abijeet-sudeep

అయితే సుదీప్‌ను ఈ షోకు పిలవడానికి ప్రత్యేకంగా కారణం కూడా ఉంది. అదేంటంటే.. ప్రస్తుతం ఉన్న హౌజ్‌మేట్స్‌లో ఒకర్ని నేరుగా ఫైనల్‌కు పంపించడం. ఆ బాధ్యతను సుదీప్‌పై పెట్టాడు నాగార్జున. ప్రస్తుతం ఇంట్లో అవినాష్, అరియానా, అఖిల్, హారిక, మోనాల్, అభిజీత్ ఉన్నారు. అందులో ఈ వారం నామినేషన్స్ నుంచి అఖిల్, మోనాల్ సేవ్ అయ్యారు. అవినాష్, అరియానా డేంజర్ జోన్‌లో ఉండి బయటపడనున్నారు. అవినాష్ తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడి ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే సుదీప్ మాత్రం ఇంట్లో ఓ సభ్యుడికి వే టూ ది ఫినాలే కార్డ్ ఇచ్చాడు.

ఇక అతడెవరో కాదు అభిజీత్. అతడిని నేరుగా ఫినాలేకు పంపించేశాడు సుదీప్. దానికి చాలా కారణాలు చెప్పాడు సుదీప్. ముఖ్యంగా ఇంట్లో ఎక్కువసార్లు నామినేట్ అయి సేవ్ అయ్యాడంటే అభి ఎంత స్ట్రాంగ్ అర్థమవుతుందని అన్నారు. అలాగే మొదటి నుండి కూడా ఆటను బ్యాలెన్సింగ్‌గా గేమ్ ఆడుతున్నాడని చెప్పుకొచ్చాడు సుదీప్. ఈ కారణాలతోనే నేరుగా అతన్ని ఫైనల్‌కు పంపిస్తున్నట్లు చెప్పాడు ఈ కన్నడ సూపర్ స్టార్. అభిజీత్ నేరుగా ఫైనల్‌కు వెళ్లిపోవడంతో మిగిలిన ఇంటి సభ్యులు షాక్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version