మూడు రోజుల్లో సుహాస్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..?

-

సుహాస్ హీరోగా వచ్చిన అంబాసిపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రిలీజ్ అయి మూడు రోజులు అయింది ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 2న సుహాస్ ఈ సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూస్తే కంటెంట్ బాగున్నా సినిమాకి కచ్చితంగా విషయం దక్కుతుందని అనిపించే విధంగా ఉంది మరోసారి ఈ సినిమా ఈ విషయాన్ని ప్రూవ్ చేసింది ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 2.8 కోట్లని వసూలు చేసింది.

రెండో రోజు 5.28 కోట్లని వసూలు చేసింది ఇక మూడో రోజు కూడా అదే ఫామ్ ని కొనసాగిస్తోంది ఈ మూవీ మూడు రోజుల్లో 8.6 కోట్లు వసూలు చేసింది. భవిష్యత్తులో ఈ మూవీ 14 కోట్ల కలెక్షన్ సాధిస్తుందని చిత్ర యూనిట్ ఎక్స్పెక్ట్ చేస్తోంది ఈ సినిమాలో సుహాస్ హెయిర్ సెలూన్ నడుపుతూ ఇంకోవైపు మ్యారేజ్ బ్యాండ్ టీం లో కలిసి పనిచేస్తూ ఉంటాడు. శివానితో లవ్ లో పడే యువకుడిగా కనబడతాడు.

Read more RELATED
Recommended to you

Latest news