శామీర్ పేటలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని టైంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. శామీర్ పేట్‌కు చెందిన బండారి దేవేందర్ (19) సెంట్రింగ్ పని చేస్తుంటాడు.
సోమవారం ఉదయం రోజు లాగే పని ఉంది అని చెప్పి ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. తన తల్లి బండారి లావణ్య ఉదయం పనికి వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా డోర్ పెట్టి ఉంది. ఎంతకు తెరవకపోవడంతో తన అల్లుడు సాయంతో డోర్ తెరవగా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకుని పోలీసులు అక్కడ కు చేరుకున్నారు.ఈ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్ పేట్ పోలీసులు తెలిపారు. యువకుడి మృతికి బెట్టింగ్స్ కారణమా? అని అనుమానిస్తున్నారు.