కరోనా తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని, ఆన్లైన్ క్లాసుల కారణంగా పిల్లల్లో బేసిక్స్ లోపించాయని ఐఐటీ ఢిల్లీ అల్యుమినీ కిరణ్ జూపల్లి పేర్కొన్నారు. అందుకే ప్రస్తుతం ఎడ్యుకేషన్ స్టాండర్ట్స్ అందుకోలేక, ర్యాంకుల కోసం కాలేజీలు పెడుతున్న ఒత్తిడి వలన తల్లిదండ్రులకు మేము న్యాయం చేయలేకపోతున్నామని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు.
IIT, NITలో చదివితేనే మనం ఇంజినీర్స్ అన్న టైం ఇది కాదని, ఎన్నో మంచి కాలేజీలు ఉన్నాయని, వాటిలో చేరినా కూడా మంచి భవిష్యత్త్ ఉంటుందని వెల్లడించారు. అంతే కానీ ఇంటర్ చదవగానే మైక్రోసాఫ్ట్ వాడు వచ్చి ఉద్యోగం ఇవ్వడు కదా? అందుకని పిల్లలు ర్యాంకుల గురించి బాధ పడి దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. ఒత్తిడి పెడితే తీసుకునే జనరేషన్ ఇది కాదని, ఈ విషయాన్ని కాలేజీ వాళ్ళు కాని, తల్లిదండ్రులు కాని దీనిని అర్థం చేసుకోవాలని సూచించారు.
తల్లితండ్రులు పిల్లలను ఒత్తిడితో కాదు ప్రేమతో జయించాలని హితవు పలికారు.