నోటిఫికేషన్లు మేమిస్తే..గొప్పలు కాంగ్రెస్ చెప్పుకుంటోంది : కేటీఆర్

-

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. బుధవారం మరోసారి ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువ వికాసం సంబరాలపైన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రంలో జరిగింది యువ ‘వికాసం కాదు..యువ విలాపమని’ విమర్శించారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్..బోగస్ హామీలు, అబద్ధాలకు కేరాఫ్‌గా ఏడాది ప్రజాపాలన సాగిందన్నారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ నియమాక పత్రాలు ఇస్తూ కాంగ్రెస్ గొప్పల చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు.ఇచ్చిన హామీలు మరిచి.. నిరుద్యోగ యువతను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్‌కు అదోగతి పడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ యువతకు,నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని గుర్తు చేస్తూనే ఉంటామని, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ కాలెండర్, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని..అందుకోసం నిరుద్యోగ యువత ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version