ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస రావు రహస్యంగా హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో భేటీ అవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో ఒక తెలగ వైరల్ అయింది. దీంతో రాష్ట్రంలో ప్రకంపనలు మొదలయ్యాయి. కాగా, ఈ క్రమంలో ఆ సమావేశంపై సుజనా చౌదరి క్లారిటీ ఇచ్చారు.
అది మర్యాదపూర్వక భేటీ అని.. అందులో ఎలాంటి తప్పులేదుని, అర్ధం లేని వీడియో టేపులతో వైసీపీ నేతలు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు ఆయన. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేరస్తుడు కాదని, ఆయన్ను కలవకూడదని రూల్ లేదని ఆయన తెలియజేశారు. తాము మంచి మిత్రులమని..ఎక్కడైనా కలుసుకునే స్వేచ్చ తమకుందని.. ఇది పెద్ద తప్పు కాదని, వైసీపీ నేతలు ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.