మీ కూతురి పేరు మీద సుకన్య సమృద్ధి స్కీమ్‌లో చేరారా? దీనిలో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా…? అయితే ఇలా చెయ్యాల్సిందే. ఇలా చేస్తే మీరు ఎంత కట్టారు అనేది మీకు తెలిసిపోతుంది. కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల కోసం ఎంతో సుకన్య సమృద్ధి యోజన పథకం పెట్టిన విషయం తెలిసినదే.
రూ.250 చొప్పున ఏడాదికి కట్టిన చాలు. గరిష్టంగా మీరు రూ.1.5 లక్షల వరకు కూడా డిపాజిట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే డబ్బులపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఇక బ్యాలెన్స్ తెలుసుకోవడం కోసం… బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయ్యి మీ బ్యాలెన్స్ ఎంత ఉందో చూడొచ్చు. లేదా పాస్ బుక్ ప్రింట్ తీసుకుంటే క్లియర్ గా ఉంటుంది.