హిమాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్నిహోత్రి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఆగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు హాజరయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ హార్లేకర్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్ లోని 68 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ 40 స్థానాలలో గెలిచింది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు కసరత్తు చేసి సుఖ్వీందర్ సుఖూని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారు. ఈయనకి ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి సన్నిహితుడుగా మంచి గుర్తింపు ఉంది. ఎమ్మెల్యే లందరినీ సమన్వయం చేసుకొని వెళ్లాలని పార్టీ హైకమాండ్ సుక్విందర్ ను ఆదేశించింది. సామాజిక వర్గాలపరంగా మంత్రివర్గ విస్తరణను త్వరలోనే చేపట్టనున్నారు.