రజనీకాంత్ దగ్గరకు రాగానే వణికిపోయిన సుకుమార్.. తర్వాత!!

-

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ‘పుష్ప’తో పాన్ ఇండియా వైడ్ పాపులర్ అయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖ దర్శకులు సైతం సుకుమార్ పైన ప్రశంసల వర్షం కురిపించారు. సుకుమార్ ను కలిసేందుకు వెయిట్ చేస్తున్నట్లు, ఆయనతో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు పలువురు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కాగా, సుకుమార్ ‘పుష్ప-2’ షూటింగ్ ను ఇటీవల స్టార్ట్ చేశారు.

లెక్కల మాస్టార్ సుకుమార్ తెరకెక్కించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. కాగా, ముందు చిత్రాలన్నీ కూడా తెలుగులోనూ విడుదలై ఘన విజయం సాధించాయి. సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజనీకాంత్ తో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ గురించి షేర్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడికి ఎంతటి గౌరవమిస్తారో చెప్పారు దర్శకుడు సుకుమార్.

తాను ‘రోబో’ చిత్రం షూటింగ్ చూడటానికి వెళ్లిన క్రమంలో తనను చూసి రజనీకాంత్ తన వద్దకు వచ్చారని, అప్పుడు తాను వణికిపోయానని గుర్తు చేసుకున్నారు. రజనీకాంత్ ను చూసి ‘సార్..సార్..’అని అన్నానని, అప్పుడు సూపర్ స్టార్ రజనీ కాంత్ తనను కుర్చీలో కూర్చోవాలని చెప్పారని తెలిపారు. తన కోసం రజనీయే కుర్చీ తీసుకొచ్చి వేశారని వివరించారు.

తను తీసిన ‘ఆర్య’ చూసిన రజనీకాంత్ అందులో హీరోయిన్ పైన తీసిన సీన్స్ గురించి చెప్పారని తెలిపారు. దర్శకుడంటే రజనీకాంత్ కు అమితమైన గౌరవమని, సూపర్ స్టార్ అయినప్పటికీ ఆయన ఎంతో ఒదిగి ఉంటారని, అందుకే ఆయన వ్యక్తిత్వం అందరికీ నచ్చుతుందన్నారు. రజనీకాంత్ తన కోసం కుర్చీ తీసుకొచ్చి కూర్చోండి సార్ అని అనడం తన జీవితంలో గొప్ప విషయమని సుకుమార్ చెప్పుకొచ్చారు. రజనీ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ‘జైలర్’ ఫిల్మ్ చేస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version