అచ్చం సౌందర్య లాగే ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

-

సోషల్ మీడియాను ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఈ సోషల్ మీడియా చెడుకు దారి తీస్తే… మంచికి కూడా దారితీస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్ ఎదుర్కొని పాపులర్ అయిన సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు. ఇక మరి కొంతమంది హీరో హీరోయిన్లకు దగ్గర పోలికతో ఉండి కూడా డూపులుగా వారి మాటలకు మాత్రమే డబ్ చెబుతూ కొన్ని వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఇలా ఉండగా అలనాటి హీరోయిన్ సౌందర్య లాగే ఒక యువతి ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

వాస్తవానికి కన్నడ రాష్ట్రానికి చెందిన సౌందర్య సొంత భాష కంటే తెలుగులోనే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది. అలా ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో కూడా నటించింది. ఎందరో స్టార్ హీరోల పక్కన నటించి మంచి విజయాలను అందుకుంది సౌందర్య. కానీ అనుకోకుండా హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించింది. ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా చాలా పద్ధతిగా కనిపిస్తూ స్టార్ హీరోయిన్ గా మారిన సౌందర్య అంటే ఇప్పటికీ చాలామంది అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. అలాంటి సౌందర్య లాగే కనిపిస్తున్న ఒక యువతి ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

అయితే ఈమె అసలు పేరు చిత్ర.. మలేషియాలో ఒక తమిళ కుటుంబంలో జన్మించిన చిత్ర కొంచెం వయసు వచ్చేటప్పటికి తాను సౌందర్య లాగా ఉన్నాననే విషయం అర్థం చేసుకుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎప్పుడు ఆమెను అలాగే పిలుస్తూ ఉండేవారట. ముఖ్యంగా జూనియర్ సౌందర్య అంటూ ఉండడంతో ఆమె తనను తాను జూనియర్ సౌందర్య గా భావిస్తూ వచ్చింది. అలా టిక్ టాక్ లు అందుబాటులోకి రావడంతో.. ఈమె సౌందర్య పాటలు, డైలాగులకు లిప్ సింక్ చేసి వీడియోలను షేర్ చేయడంతో మంచి పాపులర్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version