బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా విఫలం అవుతుండడం పై విమర్శలు ఎదుర్కొంటున్నాడు . ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా బ్యాట్ తో రాణించలేకపోయాడు విరాట్ కోహ్లీ. ఫీలింగ్ లో కూడా తప్పిదాలు చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా దీనిపై స్పందించిన భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విరాట్ కోహ్లీ రెండు మూడు మ్యాచ్ల్లో విఫలమైనంతమాత్రాన మునిగిపోయేది ఏమీ లేదని… కొన్ని రోజులు మళ్ళీ తిరిగి పాత ఫామ్ లోకి వస్తాడు అంటూ సన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ గొప్ప బ్యాట్స్ మెన్ అన్న విషయం అందరికీ తెలుసు అంటూ తెలిపిన సన్నీ… ఐపీఎల్ ముగిసే సమయానికి కోహ్లీ ఖచ్చితంగా 500 పరుగుల రికార్డు సాధిస్తాడు అంటూ చెప్పుకొచ్చారు. మొదటినుంచి బాగా ఆడి ఉంటే ఐపీఎల్ టోర్నీలో దాదాపు 1000 పరుగులు చేసే అవకాశం ఉండేది అంటూ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.