పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రెండు క్యాచ్ లను వదిలేయడం, బ్యాటింగ్ విషయంలో ఒక చిన్న బంతికి ఓడిపోవడం వంటివి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కోహ్లీ స్థాయికి తగిన విధంగా ఆడలేదు అని మాజీలు అంటున్నారు. తాజాగా దీనిపై టీం ఇండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించారు.
లాక్డౌన్ సమయంలో విరాట్ కోహ్లీ అనుష్క బంతుల్లో మాత్రమే శిక్షణ పొందాడు అని కామెంట్ చేసాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 18 ఓవర్లలో 157/3 పరుగులు చేసింది, కాని చివరి రెండు ఓవర్లలో రాహుల్ చెలరేగిపోయాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నాలుగు ఓవర్లలో 74 పరుగులు చేసి 200 దాటింది. ఇది కోహ్లీ వైఫల్యం అనే ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ ముగిసిన తరువాత, ఓటమి యొక్క పూర్తి బాధ్యతను కోహ్లీ తీసుకున్నాడు.