ఐపీఎల్ లో రికార్డ్ సృష్టించిన సునీల్ నరైన్..

-

ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ రికార్డు సృష్టించారు. టోర్నీ చరిత్రలో ఒకే జట్టు తరఫున అత్యధిక వికెట్లు (172) పడగొట్టిన ప్లేయర్ గా నిలిచారు. అతని తర్వాతి స్థానాల్లో వరుసగా లసిత్ మలింగా (170-ముంబై), జస్పీత్ బుమ్రా (158-ముంబై ఇండియన్స్), భువనేశ్వర్ కుమార్ (150-సన్ రైజర్స్ హైదరాబాద్ ), డ్వేన్ బ్రావో (140-CSK) ఉన్నారు.

కాగా, కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు . 223 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆ జట్టు 221 పరుగులకే పరిమితమైంది. బెంగళూరు ప్లేయర్లు జాక్స్(55), పటీదార్ (52) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం దక్కలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో రస్సెల్ 3, హర్షిత్, నరైన్ తలో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news