ఇప్పట్లో అనిల్ రావిపూడికే సాధ్యం అంటూ సునీల్ షాకింగ్ కామెంట్స్..!!

-

స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి తనలో ఉన్న నటనను ప్రేక్షకులకు చూపించి.. మెప్పించగలగాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్గా కూడా కలర్ ఫోటో , పుష్ప వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక తన నటనతో ఏ పాత్రలో అయినా సరే సులభంగా లీనమైపోయే సునీల్ ప్రస్తుతం తన కామెడీ టైమింగ్ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి F3 సినిమా తో సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ చేపట్టడం జరిగింది.

ఇక ఈ సినిమాలో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత మళ్ళీ పాత సునీల్ ను చూస్తారు అని ఇప్పటికే చిత్ర యూనిట్ కూడా తెలిపింది.. ఇక ఎఫ్ త్రీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్న సునీల్ ఈ ఫిలిం డైరెక్టర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి పై ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. ఈ సినిమా కోసం సుమారుగా 70 రోజులు పని చేశాను.. ఇందులో ఉన్నన్ని రోజులు అనిల్ రావిపూడి ని చాలా దగ్గరగా చూశాను.. ఆయన కష్టపడే విధానం చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఇంత మంది ఆర్టిస్టులు పెట్టి ఎవరూ కూడా సినిమా తీయలేరు అని చెప్పాడు సునీల్.

షూటింగ్ సెట్లో అనిల్ రావిపూడి ఎవరి పైనా కూడా కోప్పడటం నేను చూడలేదు. ప్రతి ఒక్కరిని కూడా తన ఫ్యామిలీ మెంబర్ లాగే చూసుకుంటాడు.. అందుకే నేను ఎప్పుడూ ఆయనతోనే ఉండేవాడిని.. ఆయనతో కలిసి భోజనం చేసే వాడిని.. సినిమా షూటింగ్ చేసేటప్పుడు కూడా మరో సినిమా షూటింగ్ ఉంది వెళ్లాలి అంటే కొంతమంది దర్శకులు విసుక్కుంటారు. కానీ అనిల్ అలా కాదు .. చాలా కంఫర్టబుల్ పర్సన్ వీలైనంత త్వరగా నా పార్ట్ కంప్లీట్ చేసి పంపించే వాడు.ఆర్టిస్టులను ఇబ్బందులకు గురి చేయకుండా వారి సమస్యలను అర్థం చేసుకొని మెలిగే దర్శకులలో ఆ కాలంలో రాఘవేంద్రరావుగారు చూశాను. ఇప్పుడు మళ్లీ అనిల్ రావిపూడిని మాత్రమే చూస్తున్నాను. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సునీల్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version