సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరదు: హర్భజన్ సింగ్

-

ఈ సారి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు లేవని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తదుపరి 2 మ్యాచ్లలో సన్ రైజర్స్ ఓడిపోవచ్చు. ఐపీఎల్లో ఏదైనా జరగొచ్చు అని అన్నారు. కేకేఆర్, రాజస్థాన్, సీఎస్కే, ఆర్సీబీ ప్లే ఆఫ్కు వెళ్లొచ్చు’ అని హర్భజన్ సింగ్ అన్నారు. కాగా హర్భజన్ వ్యాఖ్యలపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అపశకునపు మాటలు మాట్లాడుతున్నారంటూ భగ్గుమంటున్నారు. ప్యాట్ కమిన్స్ బృందాన్ని తక్కువ అంచనా వేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే… ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ , గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది .అయితే ఈ మ్యాచ్ హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే సన్రైజర్స్ హైదరాబాద్ 15 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్ కి చేరనుంది.

Read more RELATED
Recommended to you

Latest news