దీపావళి పండుగ సందర్భంగా పెద్ద మొత్తంలో బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతోందని వాటిపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కీలక తీర్పు వెలువరించింది.
పటాసుల అమ్మకాలపై నిషేధం విధించలేం..,కాని విక్రయాలపై కొన్ని షరతులు వర్తిస్తాయి అంటూ సుప్రీం పేర్కొన్న సందర్భంగా.. సుప్రీం సూచనలు – ఆదేశాలు..
దీపావళి పండగ రోజున కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు పేల్చాలి…
పర్యావరణానికి హానీ కలిగించని బాణసంచాలను మాత్రమే విక్రయించాలని..
ధ్వని కూడా తక్కువ డెసిబెల్స్ ఉండాలి
లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచి మాత్రమే వీటిని అమ్మాలి
ఈ కామర్స్ సైట్లు అమ్మకాలు జరిపితే జరిపితే వారిపై చర్యలు తప్పవు…
దీపావళి నాడు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతినిచ్చింది
వీటితో పాటు క్రిస్మస్, నూతన సంవత్సరం నాడు అర్ధరాత్రి 11.55 నుంచి 12.30 గంటల మధ్య బాణసంచా కాల్చాలని పేర్కొంది.
టపాసుల విక్రయాలపై షరతులు వర్తిస్తాయి : సుప్రీం
-