శారిడాన్ పై నిషేధం ఎత్తేసిన సుప్రీం!

-

ఇటీవల 328 డ్రగ్స్ ను సుప్రీం కోర్టు నిషేధించిన సంగతి తెలిసిందే కదా. అందులో తలనొప్పి కోసం ఎక్కువగా వాడే శారిడాన్ కూడా నిషేధానికి గురయింది.

అయితే.. తాజాగా శారిడాన్ పై నిషేధాన్ని ఎత్తేస్తున్నట్టు సుప్రీం ప్రకటించింది. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయంటూ నిషేధం విధించిన డ్రగ్స్ జాబితా నుంచి శారిడాన్ తో పాటుగా డార్ట్, పిరిటాన్ ఎక్స్ పెక్టోరాంట్ డ్రగ్స్ కు మోక్షం కలిగించింది సుప్రీం. దీంతో ఇవి మళ్లీ మార్కెట్ లో దొరకనున్నాయి.

డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు సలహా మేరకు 328 డ్రగ్స్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే.. నిషేధిత జాబితాలో తమ డ్రగ్స్ ఉండటంతో ఔషధ తయారీ సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. వాటి పిటిషన్ పై విచారించిన సుప్రీం.. ఆ మూడు ఔషధాలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news