పెళ్లికానుకగా పెట్రోల్.. నోరెళ్లబెట్టిన వధూవరులు!

-

సాధారణంగా ఎవరి పెళ్లికైనా ఏం గిఫ్ట్ గా ఇస్తారు? ఓ గడియారమో.. లేకపోతే వేరే ఏవైనా వస్తువులు ఇస్తుంటారు. కానీ.. వీళ్లు వెరైటీగా ఐదు లీటర్ల పెట్రోల్ ను వరుడికి గిఫ్ట్ గా ఇచ్చారు. షాక్ అయ్యారా? నోరెళ్లబెట్టారా? మీరే కాదు వేదిక మీద ఉన్న వధూవరులు, పెళ్లికి వచ్చిన అతిథులు కూడా నోరెళ్లబెట్టారు.

పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 90 దాటి సెంచరీకి శరవేగంగా పరుగులు తీస్తోంది. తమిళనాడులో కూడా అంతే. దీంతో చెందిన కొంతమంది యువకులు ఇలా వినూత్నంగా తమ ఫ్రెండ్ కు మ్యారేజీ గిఫ్ట్ గా ఐదు లీటర్ల పెట్రోల్ ను ఇచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో లీటర్ పెట్రోల్ ధర 85.15 రూపాయలుగా ఉంది. దీంతో పెట్రోల్ ను కూడా మ్యారేజీ గిఫ్ట్ గా ఇవ్వొచ్చని ఆ యువకులు అంటున్నారు. ఇక.. ఈ మ్యారేజీ గిఫ్ట్ కు సంబంధించిన ఫోటో, 39 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news