శ్రీశైలంలో అన్యమతస్తులకు షాపులు.. జీవో పై స్టే కొనసాగుతుందన్న సుప్రీంకోర్టు..!

-

శ్రీశైలంలో అన్యమతస్తులకు షాపులు కేటాయించవద్దన్న జీవో నెంబర్ 425 పై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. శ్రీశైలం దేవస్థానం ప్రాంతంలో అన్య మతస్తులకు దుకాణాలు కేటాయించవద్దని 2015లో జీవో 425 జారీ చేసింది ప్రభుత్వం. అయితే ఈ జీవో 425 ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు పలువురు దుకాణదారులు. 2020 లో జీవోపై స్టే విధించింది సుప్రీం కోర్టు. అయితే స్టే విధించినప్పటికీ మళ్లీ టెండర్లను పిలిచింది ప్రభుత్వం.

దాంతో మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు పలువురు దుకాణదారులు. దాంతో దుకాణాల వేలం టెండర్లను పొరపాటున జారీ చేశామని, ప్రస్తుతం వాటిని ఉపసంహరించుకున్నామని తెలిపారు ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది. ఈ అంశంపై స్థానిక అధికారులకు అయోమయం లేకుండా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. జీవో 425 అమలు చేయొద్దని మరోసారి స్పష్టంగా వెల్లడించింది సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఒకా , జస్టిస్ ఉజ్జన్ భూయల్ ధర్మసనం.

Read more RELATED
Recommended to you

Exit mobile version